చేతిలో చావు...Paart-2

             చేతిలో చావు ... పార్ట్-2



  సెల్ ఫోన్ ఎక్కువ సేపు చూడటం వలన అందరూ అరవై, డబ్బై ఏళ్లకు వచ్చే కంటి సమస్యలను ముందే కొనితెచ్చుకుంటున్నరు.
ఇలా జరగడానికి ముఖ్య కారణాలలో ఒకటి కార్పోరేట్ వ్యవస్థలు , కనీస విలువలు పాఠించకుండా , డబ్బును మాత్రమే దృష్టిలో ఉంచుకొని , ప్రజల జీవితాలతో ఆడుకోవడమే.
 ఇంతలో పోలీస్ వాహనం ,అంబులెన్స్ తో సహా వచ్చి ఆగింది .రెండు బాడీలను , వారికీ సంబధించిన వస్తువులను ముఖ్యముగా ఇద్దరి సెల్ ఫోన్లు అప్పచెప్పి వారు వెళ్లిపోయారు.పోలీసులు ఇద్దరి చావుకు కారణాన్ని ఈ విధంగా వివరించారు, మీ అమ్మాయికి మూడు నెలల క్రిందట సోషల్ నెట్వర్క్ లో ఒక మోసగాడితో పరిచయం అయ్యింది .అతనికి డబ్బులు పంపించడం , ఇద్దరు ఒకరికొకరు నగ్న దృశ్యాలను , వీడియోలను పంపించుకోవడం జరుగుతుండేది .
ఈ విషయం చనిపోయిన అబ్బాయికి కూడా తెలుసు , ఎప్పుడు సెల్ ఫోన్లో గేమ్ లు ఆడుకుంటూ, యూట్యూబ్ లో వీడియోలు చూసుకుంటూ ఉండే ఆ కుర్రడు కూడా అంతగా మానసికంగా ఎదగకపోవడం వలన ఇదంతా మోసం అని కనిపెట్టలేకపోయాడు ,ఆమె అయితే ఇంక సరేసరి .
మోసగాడి ప్రేమ వలయములో చిక్కుకొని అతన్ని కలవడానికే ఆ లొకేషన్ కి ఈ అబ్బాయిని తీసుకుని వెళ్ళింది . కానీ ఆ మోసగాడు రావడానికి ముందే ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగే క్రమములో కొండ ప్రక్కనే ఉన్న లోయలో  ప్రమాదవశాత్తు , జారి పడిపోయారు .ఆ మోసగాడిని మెం తప్పక ట్రేస్ చేస్తాం అని చెప్పి వెళ్లిపోయారు .
                     అందరు జరిగిన దారుణానికి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతుండగా పెళ్ళికొడుకు స్నేహితురాలు , లేచి బాదితుల తల్లీతండ్రులను ఒదారుస్తు, భాధ పడకండి ఆంటి , తినేవాడిపేరు ప్రతి గింజ ఫై వ్రాసి ఉన్నట్టే బ్రతికే వారి జీవిత కాలంలొ ఉదయించి గడిచే ప్రతిక్షణం వ్రాసి ఉంటుంది .
వాళ్ళకు అంతవరకే రాసిపెట్టి ఉంది ,అంతే .అంకుల్ మీరున్నట్టుగా ఈ రకమైన చావులకి , నష్టాలకు కేవలము కార్పోరేట్ వ్యవస్థలే కాదు , మీడియా ఇంకా ప్రెస్ కూడా ఒక కారణం .
డబులిచ్చి ఏది ప్రసారం చేయమన్నా , ప్రింట్ చేయమన్నా వాటిలో ఉండే వాస్తవాలను లెక్కగట్టకుండా , వాటివల్ల వచ్చే పర్యవసానాలను చూపించకుండా కేవలం ప్రకటనలు మాత్రమే ఇస్తారు .
పిల్లలకైనా , పెద్దలకైనా సమాచారం అందడానికీ మీడియా ఇంకా ప్రెస్ లే చాలా వరకు దోహదపడతాయి, అందరూ వీటినే అనుసరిస్తారు . మీడియా పని తీరు మారాలి , ప్రెస్ లు విలువలకు లోబడే పని చేయాలి , తాము ఇచ్చే ప్రకటనల ప్రొడక్ట్స్ వాడితే లేదా కనుగోలు చేస్తే కలిగే లాభ నష్టాలను అనుభవపూర్వకంగా తెలుసుకొని మరి ప్రజలకు తగిన రీతిలో , సూచనలు ఇస్తూ చూపించాలి , అప్పుడే వినియోగదారులు మేల్కొనే అవకాశం ఉంటుంది
రాత్రి నుండి తిండి లేకపోవడముతో ,అందరి మొహాలు పీక్కుపోయి , ఎడారిలో ఎండమావుల్ల ఉన్నాయి , మీరు చెబుతున్నది అంతా నిజమే అన్నట్లు రెండు శవాలు సాక్ష్యలా పడి ఉన్నాయి . తరువాత జరగాల్సి కార్యక్రమానికి సంబదించిన పనులన్నీ శరవేగంగా జరిగిపోతున్నాయి , ఈ సమయములో ఇలా మాట్లడొచ్చో లేదో నాకు తెలియదు అంటీ ,,, ,,
                      అంటూ పెళ్ళి కొడుకు లేచాడు , అంకుల్ అమ్మాయిలు అబ్బాయిలు సెల్ ఫోన్లు సోషల్ నెట్వర్క్స్ ల మోజులో పడి , తమంతటతాముగా ప్రమాదాలు కొనితెచ్చుకోవడానికి , మృత్యువు కోరల్లో చిక్కుకోవడానికి తల్లితండ్రులు , కుటుంబసభ్యలు , స్నేహితులు చుట్టూ ఉన్న సమాజం కూడా ఒక కారణం పిల్లలకు యువతీయువకులకు అనేక సందర్భాలలో అంటే పుట్టిన రోజులకు , వారు ఎగ్జామ్స్ లో పాస్ అయినప్పుడు వారికీ స్మార్ట్ ఫోన్లను గిఫ్టులుగా ఇచ్చే సంసృతికి ,
అందులో సీమ్ కార్డుకు .డేటా , ఎస్.ఎం.స్. బాలన్స్ లకు అడిగినంత డబ్బులు ఇచ్చే సంప్రదాయానికి ముందుగా తీతువు రాగం పాడాలి .
స్మార్ట్ ఫోన్ కొనిచ్చే ముందు ,దాని అవసరాలకు అయ్యే ఖర్చులకు డబ్బులు ఇచ్చే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించి , వీటిని సరైన మార్గములో వినియోగించే మానసిక సామర్థ్యం తమ పిల్లలకు ఉందొ లేదో జాగ్రత్తగా పరీక్షించుకోవాలి . లేకపోతె వారు పోర్న్ /సెక్స్ వీడియోలు , ఎక్కువ స్నేహితులతో పిచ్చిపాటి మాట్లాడుతూఉండటం, అనవసరపు చాటింగ్ లు తో విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు.
ఒక అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన పరిశోధనలో తేలిన విషయం ఏమిటి అంటే ఎవరైతే ఆన్ లైన్ లో ఎక్కువసేపు గడుపుతారో ,సోషల్ నెట్వర్క్ లో యాక్టీవ్ గా ఉంటారో, వీడియో గేమ్స్ లు ఆడుతూ ,సెల్ఫీలు దిగి పోస్ట్ చేస్తూ ఉంటారో
వారి పెరిగిన వాతావరణం ఈ విధంగా ఉంది .
1 .తల్లి తండ్రులు అతి గారాబం చేయడం మంచి చెడూ విడమర్చి చెప్పకపోవడం .
2.  చదువుకోని తల్లీ తండ్రులు అమాయకత్వం , నిర్లక్ష్యంతో చదువుకున్న తల్లి తండ్రలు ఉద్యోగం, సంపాదన లో బిజీగా ఉండటంతో పిల్లల్ని సరైన విదంగా పెంచక పోవటం .
3.పిల్లలకు ఒంటరితనాన్ని ,అబధ్రతా భావాన్ని కలుగజేయడం .
4.స్నేహితులు చుట్టూ ఉన్నవారు ఈ విధంగా ప్రేరేపించడం,  పోస్ట్ చేసే ఫొటోస్ కు, విషయాలకు ఎక్కువగా లైకులు, కామెంట్ లు వస్తే అదేదో పెద్ద విజయం సాదించినట్టుగా పరిగణించడం .

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3