చేతిలో చావు...పార్ట్3



                    తల్లి తండ్రులు కొన్నిజాగ్రత్తలతో పిల్లల్ని పెంచడం ,కుటుంబ సభ్యలు ప్రేమగా పలకరించడం ,స్నేహితులు చుట్టూ ఉన్నవారు మంచి సలహాలు ఇవ్వడం ద్వారా యువతి -యువకులు ఈ సెల్ ఫోన్ ,సోషల్ నెట్వర్క్ ,సైబర్ నేరాలు వంటి వాటి భారిన పాడకుండా కాపాడుకోవచ్చు .
సరిగ్గా చెప్పవభాయ్ అంటూ చనిపోయిన అమ్మాయి తండ్రి పెళ్ళి కొడుకుకు భుజం తట్టాడు .శవాలను తీసుకెళ్లి పోయారు .చేయవలసిన కార్యక్రమాలను సంప్రదాయబద్దంగా జరిపించారు .చనిపోయిన ఇద్దరు అందరి కళ్ళలో నుండి అశువులై రాలరు .
వదూ వరులు ఇద్దరు మంచం పై కూర్చున్నారు .నిన్న ఆగిపోయిన శోభనం ఈ రోజు జరుగుతుండటంవలన వారికీ మనసులో మళ్ళి క్రొత్తదనం వికసించింది .పేరుకే అది శోభనగాది కానీ ఆ రెండు పడుచుమనుసులో విషాదఛాయలు అలుముకున్నాయి , పందిరి మంచం అలంకరించిన గది గోడలు , ధరించిన తెల్లని దుస్తులు , మమ్మల్ని ఎపుడు స్వీకరిస్తారు అని చూస్తున పల్లు స్వీట్స్  ఇ వేమి కూడా వారి ఆలోచనలను , గత రాత్రి జరిగిన సంఘటన తాలుకు స్మ్రుతులను చెరపలేక పోతున్నాయి .
       పెళ్ళికూతురు మొఖంలో సిగ్గుకు బదులు తెలియని ఆవేదన తాండవిస్తుండగా , అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ,
 అయినా మన విద్యావ్యవస్థలో కూడా మార్పు చోటు చేసుకోవాలండీ . ఎపుడో రాసి పడేసిన సిలబస్ , అవే పాఠాలు , మానవుని విఙ్ఞానం ప్రపంచ వేగాన్ని పరుగులు పెటిస్తున్నా మన స్కూళ్లు , కాలేజీలు , కోచింగ్ సెంటరులు . ట్యూషన్లు చెప్పే పాఠాలు నత్తనడకన సాగుతుండటం నిజంగా నిజంగా సిగ్గుపడాల్సిన పరిణామం.
విధ్యార్థులకు జీవితములో ఎదగడానికి . మోసాల బారిన పడకుండా జీవించటానికి , విలువలతో కూడిన విజ్ఞానాన్ని అందించాలి .
సెల్ ఫోన్లు , పేస్ బుక్ ,యు ట్యూబ్ వంటి వాటిపై సమగ్ర అధ్యయనాలను పొందుపరిచి , వాటిని మంచి దారిలో ఎలా ఉపయోగించాలి , వాటికీ బానిసలుగా మారకుండా ఏ విదంగా నడుచుకోవాలి , లాభాలు -నష్టాలను తెలియజేస్తూ , విద్యార్థులకు కావలిసిన మనో ధైర్యాన్ని అందించాలి .
నువ్వు చెప్పింది నిజమే వాటితో పాటు ప్రభుత్వం కూడా భాద్యతాయుతంగా నడుచుకోవాలి .
ప్రభుత్వం ప్రజలకు హాని కలిగించే ఉత్పతులను తయారు చేసే సంస్థల స్థాపనకు నిరాకరించాలి . బయటి దేశాలనుండి దిగుమతి చేసుకునేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి . కేవలం దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలనే కాక భవిష్యత్ సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలి .
ఒక సెల్ ఫోన్ కానీ , అప్లికేషన్ గాని , సాఫ్ట్ వెర్ గాని మార్కెట్ లో కి అనుమతించే ముందు వాటిని కోనుగోలు చేసి , వాడటం వలన ప్రజలకు కలిగే లాభ , నష్టాలను గురించి , వాటికీ అడిక్ట్ అయితే కలిగే దుష్ప్రయోజనాల గురుంచి సమగ్రంగా చర్చించుకొని , ప్రజలకు అర్ధమయ్యే రీతిలో , సరియైన ప్రదర్శనలు , విలువైన ప్రసంగాలతో వారిని చైత్యనవంతం చేసి , మోసాలకు గురి కాకుండా , ఆరోగ్యం చెడిపోకుండా ,సమయాన్ని వృధా చేసుకోకుండా కాపాడాల్సిన బాధ్యత మన భారత ప్రభుత్వం ఫై ఉంది .
                   ప్రజలంటే ఓట్లు వేసే యంత్రాలు , టాక్స్ లు కట్టి ప్రభుత్వ ఖజానాను నింపే గుప్త నిధులు అని భావించే ఈ రాజకీయనాయకులకు , మన లాంటి సామాన్యులు ఎంత మొత్తుకున్నా , దున్నపోతు మీద వాన కురిసినట్టే .
అవునంటూ పెళ్ళికూతురు పక పక నవ్వింది , తెల్లవారింది సూర్యుడు , చీకటి తెరలను ప్రక్కకు జరుపుతూ , తన. కర్తవ్య నిర్వహణకు నడుంబిగించి బయల్దేరాడు .
పెళ్లికూతురు లేచింది , అతను ఇంకా అలాగే గాఢ నిద్రలో ఉన్నాడు . బయటకు వచ్చి వంట గదిలో కాఫి పెడుతుండగా బయటనుండి తెలియని రెండు గొంతులు స్పష్టంగా వినపడుతున్నాయి . ఆమె వంటింటి కిటికీ నుండి చూడటానికి ప్రయత్నించింది, కానీ ఎవరు కనపడలేదు . వారి సంబాషణ కొనసాగుతూనేవుంది .
1వ వ్యక్తి  : ఈ హైటెక్ మోసాలు ,ప్రమాదాలు, నర బలులు జరగటానికి బలహీనమైన యువతీ యువకుల మానసికశక్తులే ప్రధాన కారణాలు .
2వ వ్యక్తి :
అవును ఇది నూటికి నూరు పాళ్ళు నిజం.
యవ్వన దశలో ఎవ్వరికైనా తాము అందంగా కనపడాలని,అందరూ తమగురించే చర్చించుకోవాలనే తాపత్రయం, ఆరాటం ఉంటాయి.ఇది సహజం కానీ ఈ విధమైన ఆరాటం ఎక్కువ అయితేనే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి.
ఈ ఆరాటానికిి పుట్టిన బిడ్డలే ఈ సెల్ఫీ లు,whatsup  status లు,Facebook lo పోస్ట్లు పెట్టడం.
1వ వ్యక్తి :  నువ్వు చెప్పేది కరెక్టే రా , కానీ
నేను ఈ క్షణం ఎంచేస్తున్నానో అందరికీ తెలియాలి, అందరూ నన్ను గుర్తించాలి ,అన్న ఆలోచనలు ఐడెంటిటీ క్రైసిస్ అనే మానసిక జబ్బు నుండి వస్తాయి.
దీనికి సరి అయిన మానసిక వైద్యున్ని సంప్రదించి , చికిత్స పొందాలి.
తాము వేసుకున్న దుస్తులు, తిరిగిన ప్రదేశాలు , అనుభవించిన జీవితం తమ వాళ్ళందరికీ చెప్పి గొప్పగా ఫీలవడం ప్రస్తుత సమాజంలో అసుభకరమైన పరిణామం .
2 వ వ్యక్తి :
అలాగే అందరూ ఆత్మ పరిశోధన చేసుకోవాలి, యువతీ యువకులు ,పిల్లలు, టీనేజర్లు ప్రతీ ఒక్కరూ selfie లు దిగే ముందు , status లు update చేసే ముందు, కామెంట్స్,పోస్ట్లు పెట్టేముందు,పోర్న్ చూసేటప్పుడు ప్రధానంగా మూడు ప్రశ్నలు వేసుకోవాలి.
అవి
ఎందుకు చేస్తున్నాను?
ఎవరికోసం/ దేనికోసం ప్రాకులాడుతున్నను?
వీటి మూలంగా సాధించేదేమటీ?
ఇంతలో కొత్త పెళ్ళికొడుకు లేచి, కాఫీ అని బిగ్గరగా అరిచాడు. ఆ పిలుపుతో తేరుకున్న పెళ్లి కూతురు వారి మాటలు నిజమేనని తనలో తాను అనుకుంటూ తలూపింది.
ఇంతలో కాఫీ పొంగింది.
                       *******†**************************"*

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3