కుటుంబం ...పార్ట్2



  ఏ రోజూ లేనిది ఈ రోజు పూజ ఎక్కువ సేపు అలంకరించు కుంటుంది ,పెరటి లోని పువ్వులు కోసుకుని దండ గుచ్చుకుని జడలో పెట్టుకుంది ,ముఖానికి పౌడర్ రాసుకుని, బొట్టు పెట్టుకుని ,బట్టలు వేసుకుంది. సెంటు ఒంటినిండా కొట్టుకుంది.
 ఇవన్నీ ఆ తల్లిదండ్రులకు చాలా విడ్డూరంగా అనిపిస్తున్నాయి, ఎందుకో పూజ తండ్రి మనసు కీడు శంకిస్తోంది . పూజ రోజు కంటే ముందుగానే కాలేజీకి బయలుదేరింది ,టిఫిన్ తినమంటే తనకు వద్దని చెప్పి వెళ్లి పోయింది .
ఎదురింటి లో ఉండే కామేశ్వరరావు ఇంటికి వచ్చాడు, పూజ తండ్రి అతన్ని అరందాలో కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు ,ఏమి లేదండి మీ అమ్మాయిని నిన్న పార్క్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తో చూశాను.

అతను ఎర్రగా బుర్రగా బాగానే ఉన్నాడు .నా ముందే వాళ్లు అలా ఏకాంతం లోకి వెళ్లి మాట్లాడుకున్నారు. నాకు టైము అయిందని నేను ఇంటికి వచ్చేసాను ,నిన్నటి నుండి ఈ విషయం మీతో చెప్పాలని తహతహలాడుతున్నాను.అని చెప్పి వెళ్ళిపోయాడు .ఆ తండ్రి మనసు విల విల లాడింది ,ఇంట్లో డబ్బు లేకపోయినంత మాత్రాన కూతురు ఇంతకు తెగిస్తుందా అని రగిలిపోయాడు .వెంటనే తెలిసిన విషయాన్ని లక్ష్మికి,హరికి చెప్పాడు ,పూజ తండ్రి కాలేజీకి వెళ్లి ప్రైవేట్ క్లాసులు పెడుతున్నారో లేదో ఆరా తీయమని హరిని పంపాడు .

 అక్కడకు వెళ్లిన హరికి గుండెలు పగిలే నిజం తెలిసింది ,అసలు ఈ రోజు పూజ కాలేజీకి రాలేదని, ఎటువంటి ప్రైవేట్ క్లాసులు తాము నిర్వహించడం లేదని కాలేజ దగ్గర చెప్పారు, ఈ విషయం తెలిసింది లక్ష్మి తనలో తాను విక్కి విక్కి ఏడుస్తుంది, ఈడొచ్చిన పిల్లకు పెళ్లి చెయ్యకుండా చదువుకొమ్మని కాలేజీ కి పంపడం ఎంత పొరపాటో అర్థం అయ్యింది ,అని బాధ పడుతుంది.

      తండ్రి ఆవేదనలో మునిగిపోతున్నాడు. హరిని గట్టిగా పిలిచి పూజ తన స్నేహితురాలి ఇంటికి వెళ్లిిందేమో చూడమని చెప్పి, తను ఎదురింటి కామేశ్వరరావు ని పిలిచి  అతను నిన్న చెప్పిన పార్క్ దగ్గరికి వెళదాం రమ్మని తీసుకు వెళ్ళాడు .కామేశ్వరరావు భార్య అయోమయంగా వెళుతున్న ఇద్దరిని చూసింది .ఇద్దరు పార్క్ మొత్తం గాలించారు. ఎక్కడా పూజ ఆచూకి తెలియలేదు, ఊరిలోని అన్ని ప్రదేశాలు తిరిగారు కానీ పూజ కనబడలేదు . ఇంటిదగ్గర లక్ష్మి ఆవేదనతో ,గుండె భారంతో తలను గోడకేసి బాదుకుంటుంది ,ఇంతలో హరి పూజ నాన్న ఇద్దరు వచ్చి ఆమెను వద్దని వారించారు.

హరి కూడా పూజ గురించి ఏమీ తెలియలేదన చెప్పాడు, లక్ష్మి ,పూజ బట్టలలో  వెయ్యి రూపాయలు దొరికిన సంగతి చెప్పింది.
అప్పటిదాకా ఎక్కడో మూల , కన్న కూతురి మీద తన పెంపకం మీద ఎంతో కొంత నమ్మకం ఉండేది అది కాస్తా పోయింది వారికి
,సాయంత్రం అయ్యింది వరండాలో కుర్చీలో కోపంతో కూర్చున్నాడు తండ్రి ,లక్ష్మి మాత్రం గడప దగ్గర కూర్చుని ఏడుస్తుంది ,హరి గేటు దగ్గర ఆవేశంతో నిలుచున్నాడు చీకటి పడింది
ఇంతలో చేతిలో పళ్ళు ,స్వీట్ల కవర్లతో పూజ రోడ్డుపై నడుచుకుంటూ వస్తుంది .హరి రోడ్డుపైన పూజకు ఎదురెళ్లి పూజను చెంప పైన చాచి కొట్టాడు, పూజ చేతిలోని స్వీట్లు , పళ్లు రోడ్డుపైన చెల్లాచెదురుగా పడిపోయాయి. ఏంజరుగుతుందో తెలిసెలోపే  పూజను ఇంకో దెబ్బ కొట్టాడు ,వీధిలో అందరూ వీరినే చూస్తున్నారు . కామేశ్వరరావు తనభార్యతో పూజకు ఈ విధంగా జరగాల్సిందే అని భార్యతో అన్నాడు.

 హరి పూజను రెక్క పట్టుకుని ఈడ్చుకుంటూ గేటు తీసుకుని లోపలికి తీసుకెళ్లాడు, పూజ లేచి పరిగెత్తుకుంటూ నాన్న నాన్న అంటూ తండ్రి దగ్గరకు వెళ్ళింది ,ఆయన ఇటువంటి దరిద్రపు పని చేస్తా లే లం... అని ఏ తండ్రి ,కూతుర్ని తిట్టకూడని తిట్టు తిట్టి పూజ ముఖంపై ఉమ్మేశాడు.

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3