మానవత్వం vs విలువలు
విలువలు vs మానవత్వం విలువలు అంటే ఏమిటి ?ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి ,నాకున్న జ్ఞానం ప్రకారం విలువలంటే ,అన్యాయం అధర్మాలకు తావులేకుండా మన పూర్వీకులు మనకు ఇచ్చిన, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ,మనం పాటించాల్సిన ,నీతితో కూడిన నియమాలు అని చెప్పవచ్చు . ఎదుటి వ్యక్తి డబ్బులు మన ముందే కింద పడినా,అవి మనవి అనడం అన్యాయం, తిరిగి ఇవ్వక పోవడం అధర్మం ,అదే డబ్బు అతని అవసరం నెరవేర్చడానికి చట్టవిరుద్ధంగా తీసుకుంటే అవినీతి ,అతనికి తెలియకుండా తీసుకోవడం దొంగతనం ,అతన్ని కొట్టి లాక్కోవడం దోపిడి ,అప్పుగా తీసుకొని చెల్లించకపోవడం మోసం ,తీసుకుని తీసుకోలేదని బొంకడం దౌర్జన్యం, ఇస్తానన్న సమయానికి ఇవ్వక పోవడం మాట తప్పడం ,నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేవు అని చెప్పడం అబద్ధం. విలువలున్న మనిషికి అన్నిటికంటే పెద్ద గురువు తన మనస్సాక్షి . మనకు ,ఎదుటివారికి హానికలిగించే లేదా ఒక జాతికి మతానికి ,కులానికి లేక ప్రాంతానికి చెడు చేసే పనులు చేసేటప్పుడు, చేయించేటప్పుడు, ప్రోత్సహించే టప్పుడు లేదా చూస్తూ మౌనంగా ఉన్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని నిలదీస్తుంది.