కుటుంబం ... పార్ట్1



.                                   కుటుంబం


  లక్ష్మి….లక్ష్మీ. ఎక్కడున్నావ్? ఈ రోజు ఇంకా టీ పెట్టలేదా..? వంట గదిలో పనిచేస్తున్న ఆవిడకి పొద్దున్న పాలవాడు అన్న మాటలు పీడ కలల్లా వెంటాడుతున్నాయి.
అమ్మగారు ఇప్పటికీ మీరు రెండు నెలల బాకీ కట్టాలి, ఈ నెల కానీ మీరు డబ్బు కట్టక పోతే పాలు పొయ్యడం మానేస్తాను, అన్నాడు. అంత మాట అనకు రా, రాజు అబ్బాయికి ఈ నెలలో తప్పకుండా ఉద్యోగం వస్తుంద,ి జీతం రాగానే కట్టేస్తాను ,ఇదే మాట రెండునెలలుగా అంటున్నారు ,చూద్దాం లెండి .
పాలు అయితే ఉన్నాయిగాని టీ పొడి లేదు,చక్కెర కూడ డబ్బాలో కొద్దిగా మాత్రమే ఉంది .అడగడానకు పక్కింటి వదిన గారి దగ్గరికి పరిగెత్తింది లక్ష్మి .వదిన గారు కొద్దిగా టీ పొడి ఉంటే ఇవ్వండి, వచ్చే వారం  తిరిగి ఇచ్చేస్తాను.

 పొయ్యి మీద టి పెట్టింది ఇంతలొ తనకు పెళ్లి నుండి ఇప్పటివరకు గడిచిన కాలం కళ్ళ ముందే తిరిగింది ,భర్తకు ఫ్యాక్టరీలో ఉద్యోగం, నిజాయితీగా పని చేయడం వలన ఏమి  సంపాదించ లేకపోవడం ,అబ్బాయికి డిగ్రీ వరకు చదువు చెప్పించడం, అమ్మాయిని ఇంటర్ కాలేజీ లో చేర్పించడం ,భర్తకు అనారోగ్యం ,తర్వాత ఆయన ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండడం ,అన్ని అన్ని గుర్తుకు వచ్చాయి .ఎక్కడ సహాయం అడుగుతామో అని బంధువులు ఇటు పక్కకు రావడమే మానేశారు.
 ఇంతలో పూజ ,హరి నిద్రలేచారు పూజ తల్లి దగ్గరకు వచ్చి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అన్నది .ఆ పిలుపుతో తేరుకున్న లక్ష్మీ సమాధానం చెప్పకుండా ,భర్తకు  టి తీసుకెళ్లి ఇచ్చింది ,అందరూ టీ తాగారు,హరి ఈ రోజైనా జాబ్ కి సెలెక్ట్ అవుతావా?
తప్పకుండా సెలెక్ట్ అవుతాను నాన్న . పూజా పోనీ మన పరిస్థితులు చక్కబడే వరకు కాలేజీ మానేయే ,చార్జీలు పుస్తకాల ఖర్చులు అయినా మిగులు తాయి. ఆ మాటతో పూజ ప్రాణం చివుక్కు మంది, తనలో తాను ఏడ్చింది కాలేజీలో క్యాంటీన్ ఓనరు తను చెప్పినట్టు నడుచుకుంటే అన్నయ్యకు ఉద్యోగం ఇస్తాను  అని భుజం పై చేయి వేసి చెప్పిన మాట గుర్తొచ్చింది , తన బాధ ఇంకా ఎక్కువ అయ్యింది.

 పిల్లలు బయలుదేరి వెళ్ళి పోయిన తరువాత భార్య భర్తలు ఇద్దరు కష్ట సుఖాలు మాట్లాడుకుంటున్నారు ,భోజన సమయం అయ్యింది .బియ్యం  ఇద్దరికి మాత్రమే సరిపడగా ఉన్నందు వలన అన్నం తక్కువగా ఉంది .అందువలన లక్ష్మి పొద్దుటి నుండి తనకు ఆకలిగా లేదని అంటూ ఉంది. అసలు విషయం తెలిసిన భర్త తన కంచం లోని అన్నాన్ని  తను తింటూ లక్ష్మికి కూడా తినిపించాడు. వీరి భోజనం ముగిసే సరికి హరి వచ్చాడు ,

హరికి తల్లి ఎదురు వెళ్ళి ఉద్యోగం వచ్చిందా ?అని ఆదుర్దాగా అడిగింది. ఇంట్లో లక్ష్మి లేకపోయినా మహా లక్ష్మి లా కళ కళ లాడే తల్లి ముఖం చూసి ఉద్యోగం రాలేదని చెప్పలేకపోయాడు, ఫోన్ చేస్తానని చెప్పారు అన్నాడు.ఫోన్ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా అని అడుగగా , తల ఊపి వెళ్ళిపోయాడు.
 అలా అన్నాడే కానీ తను వెళ్ళిన ఉద్యోగం దగ్గర ప్రాంతీయ ,కుల ,మత ,పిచ్చితో తమ వాళ్లనే సెలెక్ట్ చేస్తున్నారు. తన ప్రతిభతో అన్ని దాటి  చివరి రౌండ్ కి వస్తే ,అక్కడ లంచం అడిగారు .
సరేలే రా రా వచ్చి అన్నం తిను, వద్దమ్మా ఆకలిగా లేదు అని వెళ్ళిపోయాడు ఎక్కడ భోజనానికి కూర్చుంటే తను, స్నేహితులతో మందు తాగిన విషయం ఇంట్లో తెలిసిపోతుందని ,
పూజ మనిషి మాత్రమే క్లాస్ లో కూర్చుంది, మనసు మాత్రం తన కుటుంబ ఆర్థిక పరిస్తితులు,తండ్రి అనారోగ్యం , అన్నయ్య నిరుద్యోగం వంటి విషయాల పైనే ఉంది.      సాయంత్రం 7 అయింది 5 గంటలకు రావాల్సిన కూతురు, 7 అయినా రాకపోవడంతో దంపతులు ఇద్దరూ కంగారు పడుతున్నారు. సమయానికి హరి కూడా ఇంట్లో లేడు, బయటకెళ్ళి చూసిరమ్మందాం  అంటే .
ఇంతలో తలుపు చప్పుడు అయ్యింది ,పూజ వచ్చింది వళ్ళంతా చమటలు ,ఏమైందే ఇంత లేట్ అయింది ,ప్రైవేట్ క్లాసులు ఉన్నాయి అంది ,మనిషి కొంచెం నీరసంగా ఉంది .
పూజ వచ్చీ రాగానే వెంటనే బాత్రూం లోకి వెళ్లిపోయింది ,అక్కడే ఉంటే బట్టలు నలగడం ,జుట్టు చేదరడం వంటివి అమ్మ నాన్నలకి తెలిసి పోతుందేమో అని .లక్ష్మి వంటసామాన్లు కిరాణా షాపులో అప్పు తెచ్చి వంట చేసింది ,అందరూ భోజనానికి కూర్చున్నారు ,హరి కూడా అప్పుడే వచ్చాడు ,పూజ ఆదరా బాదరాగా తిని వెళ్ళిపోయింది.
          సమయం 2: 00 అయింది అయినా ఆ ఇంటిలో నిద్రపోనిది ఇద్దరే ఇద్దరు, ఒకరు తండ్రి తన కూతురు ప్రవర్తన చూసి కంగారు తో నిద్ర పట్టడం లేదు, ఇంకొకరు పూజ ఏమైందో ఏమో పూజకు అస్సలు నిద్ర పట్టడం లేదు ఏదో తెలియని బెంగ ,బాధ తనను వెంటాడుతున్నాయి .తెల్లవారింది తల్లి ముందు రోజు పూజ విషయంలో జరిగిందంతా హరి తో చెప్పింది ,హరి ఆలోచనలో పడ్డాడు.

     

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3