Posts

కర్తవ్యం

                                 కర్తవ్యం బయలుదేరు బయలుదేరు భయం లేకుండా, బాధపడకుండా! నిప్పులు చెరిగే రాకెట్ లా నిద్రను తరిమి చెమటలు తెచ్చే పీడకలలా , పద్మవ్యూహంలో అర్జునుడివై శత్రు సంహారం లో పరశురాముడివై , విరామం లేకుండా, విశ్రాంతి పొందకుండా! బయలుదేరు బయలుదేరు భయం లేకుండా బాధపడకుండా ! ఆలస్యమైతే నీచకులు కీచకులు, సముద్రాలకవతల ,కొండల లోపల పారిపోతారు దాక్కుంటారు ! మనిషి బతికుండగానే రక్తం తాగే ఆ దుష్టుల పాపం పండింది , శిక్షా కాలం వచ్చింది! బయలుదేరు బయలుదేరు భయం లేకుండా బాధపడకుండా ! వృత్తి పై కొడితే విధి అనుకున్నావు కడుపు పై కొడితే కన్నీరు కార్చావు కానీ చంపాలని చూస్తే నువ్వే చంపెయ్! ముల్లుని ముల్లుతోనే తియ్యాలి , చావుని చావు తోనే చంపాలి ! జాలి దయ పనికిరావిక్కడ కత్తి ,కసి పనిచేయాలిక్కడ! బయలుదేరు బయలుదేరు భయం లేకుండా బాధపడకుండా ఇది జవాబు నీలో ప్రశ్నకి ఇది ఆచరణ నీలో ఆలోచనకి ! ప్రజల ఆశలు నీలో ఉన్నాయ్ దేవుని ఆశీస్సులు నీతో ఉంటాయ్! ప్రతీ ఒక్కడు మారాల్సిన సమయమిది మార్చాల్సిన తరుణమిది! అజ్ఞానం అంటుకుని ,అమాయకత్వం ఆవిరై ఆకాశం లో మేఘమై గుండె భూమిలో జ్ఞాన చినుకులు కురవాలి,

మానవత్వం vs విలువలు

                           విలువలు vs మానవత్వం       విలువలు అంటే ఏమిటి ?ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం వెతకాలి ,నాకున్న జ్ఞానం ప్రకారం విలువలంటే ,అన్యాయం  అధర్మాలకు తావులేకుండా మన పూర్వీకులు మనకు ఇచ్చిన, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే ,మనం పాటించాల్సిన ,నీతితో కూడిన నియమాలు అని చెప్పవచ్చు .                 ఎదుటి వ్యక్తి డబ్బులు మన ముందే కింద పడినా,అవి మనవి అనడం అన్యాయం, తిరిగి ఇవ్వక పోవడం అధర్మం ,అదే డబ్బు అతని అవసరం నెరవేర్చడానికి చట్టవిరుద్ధంగా తీసుకుంటే అవినీతి ,అతనికి తెలియకుండా తీసుకోవడం దొంగతనం ,అతన్ని కొట్టి లాక్కోవడం దోపిడి ,అప్పుగా తీసుకొని చెల్లించకపోవడం మోసం ,తీసుకుని తీసుకోలేదని బొంకడం దౌర్జన్యం, ఇస్తానన్న సమయానికి ఇవ్వక పోవడం మాట తప్పడం ,నీ దగ్గర డబ్బులు ఉన్నా కూడా లేవు అని చెప్పడం అబద్ధం.             విలువలున్న మనిషికి అన్నిటికంటే పెద్ద గురువు తన మనస్సాక్షి . మనకు ,ఎదుటివారికి హానికలిగించే లేదా ఒక జాతికి మతానికి ,కులానికి లేక ప్రాంతానికి చెడు చేసే పనులు చేసేటప్పుడు, చేయించేటప్పుడు, ప్రోత్సహించే టప్పుడు లేదా చూస్తూ మౌనంగా ఉన్నప్పుడు మన మనస్సాక్షి మనల్ని నిలదీస్తుంది.     

కోడలు పాట

పుట్టింట్లోమహారాణిలా పెరిగిన అమ్మాయి ,అత్త గారి ఇంట్లో చాలా కష్టాలు అనుభవిస్తుంది ,అత్తగారు తోడికోడలు, భర్త ఆమెను హింసిస్తూ ఉంటారు .ఆమె బాధతో ఏడుస్తూ ఉంటుంది ,అప్పుడు ఈ పాట: పాట 2 ఏడవ కమ్మా చిన్నారి ,రేపటి రాజ్యానికి నువ్వే రాకుమారి కన్నీరొద్దమ్మా ,నవ్వవే ఒంటరి చిలకమ్మా ! అండగా ఉండే భర్త కాడు, ధైర్యం చెప్పే తండ్రి రాడు, నిన్ను ఎంత తిట్టినా,హింస పెట్టినా మౌనంగా భరించడమే నీ ఆయుధం ,ఇది నీకు దేవుడు ఇచ్చిన శాపం . విధి నిన్ను వెక్కి రించిన, కాలం నిన్ను కాటేసినా, ఏడవ కమ్మా చిన్నారి ,రేపటి రాజ్యానికి నువ్వే రాకుమారి కన్నీరొద్దమ్మా ,నవ్వవే ఒంటరి చిలకమ్మా ! గడపదాటితే కాలనాగులు, అడుగడుగునా  విషపు కాట్లు, తగదమ్మా నీకు, గడప దాటి పోకు! వస్తాడమ్మా వారసుడు,నీ కడుపున పుడతాడు, తల్లికి శాపం వదల్చిన గరుత్మంతుడు ,శత్రువుల గుండెలు చీల్చే సంజయుడు ! కాలం నీపై కన్నెర్రజేసిన ,కష్టం నీపై నిప్పులు కురిపించినా, ఏడవ కమ్మా చిన్నారి ,రేపటి రాజ్యానికి నువ్వే రాకుమారి కన్నీరొద్దమ్మా ,నవ్వవే ఒంటరి చిలకమ్మా ! ఆ ఇంట్లో మహా రాణి లా  పెరిగావు, ఈ ఇంట్లో బలిపశువు అయ్యావు.  అమ్మ అవ్వాల్సిన అత్త ,అపమృత్యువు అయ్యిం

శిక్ష

                 పాట                       బయలుదేరు బయలుదేరు భయం లేకుండా, బాధపడకుండా! నిప్పులు చెరిగే రాకెట్ లా నిద్రను తరిమి చెమటలు తెచ్చే పీడకలలా , పద్మవ్యూహంలో అర్జునుడివై శత్రు సంహారం లో పరశురాముడివై , విరామం లేకుండా, విశ్రాంతి పొందకుండా! బయలుదేరు బయలుదేరు భయం లేకుండా బాధపడకుండా ! ఆలస్యమైతే నీచకులు కీచకులు, సముద్రాలకవతల ,కొండల లోపల పారిపోతారు దాక్కుంటారు ! మనిషి బతికుండగానే రక్తం తాగే ఆ దుష్టుల పాపం పండింది , శిక్షా కాలం వచ్చింది! బయలుదేరు బయలుదేరు భయం లేకుండా బాధపడకుండా ! వృత్తి పై కొడితే విధి అనుకున్నావు కడుపు పై కొడితే కన్నీరు కార్చావు కానీ చంపాలని చూస్తే నువ్వే చంపెయ్! ముల్లుని ముల్లుతోనే తియ్యాలి , చావుని చావు తోనే చంపాలి ! జాలి దయ పనికిరావిక్కడ కత్తి ,కసి పనిచేయాలిక్కడ! బయలుదేరు బయలుదేరు భయం లేకుండా బాధపడకుండా ఇది జవాబు నీలో ప్రశ్నకి ఇది ఆచరణ నీలో ఆలోచనకి ! ప్రజల ఆశలు నీలో ఉన్నాయ్ దేవుని ఆశీస్సులు నీతో ఉంటాయ్! ప్రతీ ఒక్కడు మారాల్సిన సమయమిది మార్చాల్సిన తరుణమిది! అజ్ఞానం అంటుకుని ,అమాయకత్వం ఆవిరై ఆకాశం లో మేఘమై గుండె భూమిలో జ్ఞాన చినుకులు కురవాలి,

తప్పు        నరికే

 తప్పు         నరికే తప్పదంటూ ,తప్పుకాదంటూ తరాలనుండి తమవరకు తమకు ఎదురు లేదని తొనకక బెనకక తలలెగరేస్తూ తిరుగుతూ తిప్పుకుంటూ తిక్కతిక్కగా తప్పు చేస్తున్న తప్పుడు నా కొడుకుల , తప్పులను తవ్వితీసి, తప్పుకు శిక్ష తధ్యమని, తప్పించుకుని ,తిరగనివ్వక తగదనక,తడబడక తుఫానులా తుడిచి తుడిచి , తిట్టి తిట్టి ,తన్ని తన్ని తరిమి తరిమి ,తొక్కి తొక్కి తాట తీసి ,తోలు వలిచి తలనరికి , తెగనరికి తనువులు తగలబెట్టే.             ********************************

ప్రేమ విఫలం / సఫలం

ప్రేమ      విఫలం / సఫలం          నా దృష్టిలో  ప్రేమ చెడ్డది కాదు ,ప్రేమించడం తప్పూ కాదు, కానీ ప్రేమలో పడటం వలన  ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనే మానసిక పరిపక్వత, మనోబలం లేకపోవడం దురదృష్టకరం . ఇది లేనివారు ప్రేమించడం వారికి అపాయకరం, అని నా ఉద్దేశ్యం.                      ఉదాహరణకు నాకు తెలిసిన ఫ్రెండ్ చెల్లి పదవ తరగతిలో స్కూల్ ఫస్ట్ ,కానీ ఇంటర్లో సాధారణ మార్కులతో పాస్ అయింది .దీనికి కారణం ఆ అమ్మాయి ఇంటర్లో ప్రేమలో పడటమే ,అమ్మాయి ఎప్పుడూ ఫోన్ లో ఆ అబ్బాయితో మాట్లాడటం, చాట్ చేయడం ,క్లాస్ రూంలో కూర్చున్న అతని గురించే ఆలోచించడం, సెలవు రోజులలో కలిసి బయట తిరగడం అతనితో గొడవ ఏదైనా జరిగినప్పుడు మూడీగా ఉండడం, ఏ పని చేయకపోవడం చేస్తుండేది ,ఫలితంగా ఆమె చదువు  పెడదారి పట్టింది.                       మన సమాజంలో ప్రేమించే వారిలో ఎక్కువ మంది అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలియ కుండా గానీ తాము ఆ వ్యక్తితో ప్రేమలో విఫలం అయినా, సఫలం అయినా ఎదుర్కోవలసిన ఆర్థిక ,కుటుంబ ,సమాజ పరిస్థితులను సరిగ్గా వాస్తవ దృష్టితో అంచనా వేయకుండా గానీ ,  కాలంతో పాటు మనిషిలో, మనిషి వ్యక్తిత్వంలో చోటు చేసుకునే మార్పులు వంటి వాటి