శిక్ష

                 పాట
                     

బయలుదేరు బయలుదేరు భయం లేకుండా, బాధపడకుండా!

నిప్పులు చెరిగే రాకెట్ లా నిద్రను తరిమి చెమటలు తెచ్చే పీడకలలా ,

పద్మవ్యూహంలో అర్జునుడివై శత్రు సంహారం లో పరశురాముడివై ,

విరామం లేకుండా, విశ్రాంతి పొందకుండా!

బయలుదేరు బయలుదేరు భయం లేకుండా బాధపడకుండా !

ఆలస్యమైతే నీచకులు కీచకులు,

సముద్రాలకవతల ,కొండల లోపల

పారిపోతారు దాక్కుంటారు !

మనిషి బతికుండగానే రక్తం తాగే

ఆ దుష్టుల పాపం పండింది , శిక్షా కాలం వచ్చింది!

బయలుదేరు బయలుదేరు భయం లేకుండా బాధపడకుండా !

వృత్తి పై కొడితే విధి అనుకున్నావు

కడుపు పై కొడితే కన్నీరు కార్చావు

కానీ చంపాలని చూస్తే నువ్వే చంపెయ్!

ముల్లుని ముల్లుతోనే తియ్యాలి ,

చావుని చావు తోనే చంపాలి !

జాలి దయ పనికిరావిక్కడ

కత్తి ,కసి పనిచేయాలిక్కడ!

బయలుదేరు బయలుదేరు

భయం లేకుండా బాధపడకుండా

ఇది జవాబు నీలో ప్రశ్నకి

ఇది ఆచరణ నీలో ఆలోచనకి !

ప్రజల ఆశలు నీలో ఉన్నాయ్

దేవుని ఆశీస్సులు నీతో ఉంటాయ్!

ప్రతీ ఒక్కడు మారాల్సిన సమయమిది

మార్చాల్సిన తరుణమిది!

అజ్ఞానం అంటుకుని ,అమాయకత్వం ఆవిరై

ఆకాశం లో మేఘమై

గుండె భూమిలో జ్ఞాన చినుకులు కురవాలి,

ధైర్యము మొక్కలు మొలవాలి!

బయలుదేరు బయలుదేరు

భయం లేకుండా బాధపడకుండా !

నిన్ను కన్న నీ తల్లి గర్వపడే క్షణమిది

నిన్ను మోసే భూతల్లి పులకిస్తున్నది !

యుద్ధం  నీ ధర్మమని ,న్యాయం నీ ఆశయమని

మరణమే నిన్ను చూసి పారిపోయేలా

పగవాడు నిన్ను చూసి పరుగు పెట్టేలా

బయలుదేరు బయలుదేరు

భయం లేకుండా ,బాధపడకుండా!

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3