యుద్థ0 ( చేద్దామా...?)

                              యుద్థ0
                                    మార్పుకు శ్రీకారం?


ఎగురుతున్న జెండా
ఏమైనా చెబుతుందా !
రణభేరి మ్రోగాలి ఇంటింటా,
మదినిండా!
నీ ఆశయాన్నే శ్వాసగా చేసి , ఆయువునే ఊపిరిగా పోసి
సమర శంఖం పూరించు!
దోపిడీ వ్యవస్థ దద్దరిల్లెలా,
శత్రువు గుండెలలో నెత్తుటి ప్రవాహం గడ్డ కట్టుకు పొయ్యేలా,
విజయ ఢంకా మ్రోగించు!
శత్రువు అంటే కోటల లోపల,గోడల వెనుక లేడు
నీలోనే ఉన్నాడు , నీ చుట్టూ ఉన్నాడు!

నీ ఆవేశాన్ని ఆయుధంగా,
సాహసాన్ని హస్వం గా మార్చుకుని
కురుక్షేత్రం లో
సంజయుని వలె బయలుదేరు!
మార్గమధ్యంలో స్మశానంలో
సమాధులను సందర్శించు,
చేసిన దుర్మార్గాలు ,  మోసిన అపకీర్తి లతో
విశ్రమించు పవిత్ర స్థలం అది .

స్వేద బిందువులకే భయపడకు,
           రణ రంగంలో రక్తపుటేర్లు పారచ్చు !
విజయమో వీర మరణమో అన్నది
ఒకప్పటి మాట,
విజయమో వెన్నుపోటో అన్నది
ఇప్పటి బాట !
చావును చూచి,  ఓటమిని తలచి
హడలి పోకు,
అవి తధ్యం
ఇది చరిత్ర చెబుతున్న సాక్ష్యం!
వాటిని పలకరించి పరిణయించి ,
పరిహాసించి పరవశించు .


                                   రాజారావు తుమ్మలపల్లి

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3