ఇల్లు - పాట

ఇల్లు - పాట

సంతోషమే ఆనందంగా , మా ఇంట్లో అడుగు పెట్టదా

మా పక్కన చోటిమ్మనీ , మమ్మల్నే బతిమాలదా!

దేవుడిచ్చిన తేనెమనసులు వికసించెను మల్లె మనసులై ఇంట్లో పెద్దలే ,వయసొచ్చిన చంటాళ్లై గెంతుతూ , తుళ్లుతూ,గడుపుతారు ప్రతి సాయంత్రాన్ని,

ఆహ్వానిస్తారు ప్రతి ఉదయాన్ని ఆస్వాదిస్తారు ప్రతి క్షణాన్ని ,

సంతోషమే ఆనందంగా , మా ఇంట్లో అడుగు పెట్టదా

మా పక్కన చోటిమ్మనీ , మమ్మల్నే బతిమాలదా!

స్వార్థ లే లేవు మాకు సరదాలే హాయి మాకు ,

రోజు వచ్చే టీవీ సీరియళ్లు ,మా మాకుండే చిన్ని కష్టాలు అవి తెప్పించే కన్నీళ్లు ,

స్వచ్ఛంగా ఉండే మా నవ్వులు ,గలగల పారే సెల యోళ్లు, మా హోరుని చూసి ,   హుషారుని చూసి ,

మూగ బోవా జింక పిల్లలు.

సంతోషమే ఆనందంగా , మా ఇంట్లో అడుగు పెట్టదా

మా పక్కన చోటిమ్మనీ , మమ్మల్నే బతిమాలదా!

పచ్చని మా కాపురం ,సిరిగల గోపురం

ఆదివారం వస్తే ఈ ఇంట ,మగవారిదే ప్రతీి వంట

 మా కున్న చిన్నపిల్లలు ,దేవుడిచ్చిన గొప్ప వరాలు

సంతోషమే ఆనందంగా , మా ఇంట్లో అడుగు పెట్టదా

మా పక్కన చోటిమ్మనీ , మమ్మల్నే బతిమాలదా!

ఆదివారం వస్తే ఈ ఇంట ,మగవారిదే ప్రతీ వంట

మాకున్న ఈ పిల్లలు ,దేవుడిచ్చిన గొప్ప వరాలు

లేదనే మాటే లేదు ,కాదనే మనసే కాదు

ఇది మా కుటుంబం ,మా కలలకు ప్రతిబింబం .

మమ్మల్ని ఏం చేస్తుంది కష్టం, మాదంతా ఐకమత్యం,

సంతోషమే ఆనందంగా , మా ఇంట్లో అడుగు పెట్టదా

మా పక్కన చోటిమ్మనీ , మమ్మల్నే బతిమాలదా!

ఇంట్లో అందరినోటా , ఎప్పుడు పలికే ఒకే మాట

ఇక్కడ తప్పులు జరగవు ,శిక్షలు ఉండవు

మా మతమే మానవత్వం ,మా కులమే మంచి గుణం,

ఎక్కువ ఆలోచించం ,ఎప్పుడూ నవ్వుతుంటాం

సంతోషమే ఆనందంగా , మా ఇంట్లో అడుగు పెట్టదా

మా పక్కన చోటిమ్మనీ , మమ్మల్నే బతిమాలదా!

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3