కుటుంబం...పార్ట్3





                                    కుటుంబం ...పార్ట్3






ఈ దారుణాలు తట్టుకోలేక పూజకు కళ్లు తిరుగుతున్నాయి,ఇంతలో వీదిలోవారు ఇదంతా చోద్యం చూడటానికి రావడం ,లక్ష్మి గమనించింది ,వారిలో కామేశ్వరరావు భార్య వేగంగా నడుస్తూ రావడం లక్ష్మికి కనపడింది .వెంటనే లక్ష్మి ,హరి ని పిలిచి చేతికి తాళం ఇచ్చి గేటుకి వేసి రమ్మని చెప్పి, పూజను లోపలకు లాక్కుని వెళ్ళింది .హరి గీటుకి తాళం వేసి, ఇంట్లోకి వచ్చి తలుపులు మూసేశాడు
తండ్రి , పూజను కళ్ళు తిరిగి మైకం వచ్చినట్లు నచ్చి నటించింది చాల్లే ,ఇంక నిజం చెప్పు ?ఎన్నాళ్ల నుండి చేస్తున్నావు ఈ ఎదవ పని అని అరిచినట్లుగా అడిగాడు. ఆ ప్రశ్నకు పూజ హృదయం బద్ధలైంది ,ఇంకోవైపు అన్న జుట్టు పట్టుకుని, ఎడా పెడా కొడుతున్నాడు .
తల్లి మాత్రం తన చేత్తో తన తలను తనే కొట్టుకుంటూ అంతా నా ఖర్మ అంటూ ఏడుస్తుంది ,పూజ తేరుకుని ఏమంటున్నారు నాన్నా ?అని అమాయకంగా అడిగింది .దానికి ఆయన,నీకు కాలేజీలో  ప్రైవేట్ క్లాసులు లేవు కానీ నువ్వు ఇంటికి ఆలస్యంగా వస్తావ్ ,బట్టలు నలిగిపోయి ఉంటాయి, జుట్టు బాగా చెదిరి ఉంటుంది ,బాగా చెమటలు పడతాయి, ఏం చేస్తే ఇలా జరుగుతుంది?

ఈరోజు నీ పుస్తకాలలో వెయ్యి రూపాయలు దొరికాయ,ి ఎక్కడివి నీకు, పొద్దున టిఫిన్ తినమంటే వద్దని వెళ్ళిపోయావు ,బయట తినడానికి నీకు డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి ?ఈ రోజు కాలేజీకి  వెళ్ళకుండా ఏ పార్కు కి వెళ్ళావు, దొంగ ముం... పడుకుని డబ్బు సంపాదించడానికి సిగ్గులేదూ,
ఇంతలో బయట గేటు కొడుతున్న శబ్ధం వినపడుతుంది ,కామేశ్వరరావు భార్య వదిన వదిన అని పిలవడం తెలుస్తుంది కానీ , ఆ అరుపులు ఏవి వీళ్ళు పట్టించుకోవడం లేదు.
 తండ్రి పూజ తన బెల్టుతో పూజను కొడుతూనే మాట్లాడుతున్నాడు ,అన్నయ్య తిడుతున్నాడు ,తల్లి వెక్కి వెక్కి ఏడుస్తుంది .
అప్పుడు పూజ ఆత్మాభిమానం, నీరసం కలిసిన గొంతుతో అసలు విషయం చెప్పడం ప్రారంభించింది.
       నాన్నా ,మీరు అనుకుంటున్నట్టు నేను ఎటువంటి తప్పుడు పని చెయ్యట్లేదు,మా మాస్టారు గారి అమ్మ గారికి కుష్టు వ్యాధి. ఆమెని చూసుకోవడానికి ,సపర్యలు చేయడానికి ఎవరూ ముందుకు రాక పోతుంటే ,నెలకు మూడు వేల రూపాయలకు జీతానికి నేనే ఆ పని చెయ్యడానికి ఒప్పుకున్నాను.మీకు చెప్తే వద్ధంటారని అని భయపడి చెప్పలేదు ,పొద్దున్న ,సాయంత్రం ఆవిడని చూసుకోవాలి అన్నం పెట్టాలి , మందులు ఇవ్వాలి.నేను వద్దంటున్నా వినకుండా మాస్టారు గారు వెయ్యి రూపాయలు అద్వాన్సుగా ఇచ్చారు.

అవి మీకు ఇద్దామని పొద్దున్న హడావిడిలో మర్చిపోయాను ,ఆవిడకి సేవలు చేసి ,అక్కడ ఎక్కువగా పని చేయడం వలన బట్టలు నలిగాయి, జుట్టు చెదిరింది, ఆటో లోనో బస్సు లోనో వస్తే చార్జీలకు డబ్బులు ఖర్చు అవుతాయని అంత దూరం నుండి త్వరగా నడిచి వచ్చేసరికి బాగా చెమటలు పట్టాయి .
ఆవిడకి మనిషి శుభ్రంగా లేకపోతే నచ్చదట అందుకనే పొద్దున్న అంతలా ముస్తాబై వెళ్లాను, టిఫిన్ ఎందుకు తినలేదు అంటే అమ్మ ఇంట్లో వంట కొద్దిగా చేస్తుంది, అది మన అందరికీ సరిపోదు ,నేను అక్కడ ఏ పండో ఫలహార మో తింటాను,అందుకే పొద్దున తినకుండా వెళ్ళిపోయాను.

        ఆవిడ నేను వచ్చేటప్పుడు ఇంట్లో మిగిలిన పళ్ళు, స్వీట్లు ఇచ్చి పంపింది ,అవి ఇందాక బయట రోడ్డు మీద పడిపోయాయి.
అమ్మా , నాకు బాగా నీరసంగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం అన్నం పెట్టు అని పూజ తల్లిని దీనంగా ప్రాధేయ పడింది ,ఇంతలో తండ్రి రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా? అని అబద్ధాలు కూడా బాగానే చెప్తున్నావు, అని వీపు పైన కొట్టాడు . తల్లికి పూజ చెప్పింది నిజమేనని అనిపించింది ,ఆవిడ తన కళ్ళు తుడుచుకుని పరుగులాంటి నడకతో వంటగదిలోకి వెళ్ళి అన్నం కంచంలో పెట్టుకుని వచ్చి పూజకు తినిపించ బోతుండగా, పూజ ఎంతో ఆశతో నోరు తెరిచింది ,ఇంతలో పూజ తండ్రి ,తల్లి చెంపపై కొట్టాడు, చేతిలోని అన్నం కంచం కిందపడి నేలపాలు అయ్యింది,

             పూజ తల్లిని కొట్టవద్దని తండ్రి కాళ్ళపై పడింది .అతను పూజను కాళ్లతో విదిలించి ,ఒరేయ్ హరి దీని మాస్టారి ఇంటికి వెళ్లి నిజం కనుక్కొని రా రా ? అని పంపాడు .హరి బయటకు వెళ్లడానికి గేటు తీసాడు, కామేశ్వరరావు భార్య పరుగున ఇంట్లోకి వచ్చి ,
అయ్యో అన్నాయ్యా, ఈయన మాటలు నమ్మి మీరు పూజని అనుమానిస్తున్నారా, ఈయనకు మతిమరపు పైగా రేచీకటి ,అసలు ఈయన నిన్న సాయంత్రం పార్క్ కి వెళ్ళ లేదు . ఎప్పుడో ఎక్కడో వేరేఎవరినోి చూసి పూజ అని భ్రమ పడ్డారు అంతే.

ఈ మాటలు విన్న ఆ తల్లిదండ్రులకు గుండెల్లో పిడుగు పడినట్లు అయింది . హరి వచ్చి పూజ చెప్పింది నిజమే అన్నాడు ,ఇంతలో పూజ కిందపడ్డ అన్నాన్ని చేతితో పోగుచేసి ఒక్కో ముద్ద నోట్లో పెట్టుకుని ఆకలితో ఉన్నందువల్ల గబగబా తింటుంది.నలుగురు పూజ వైపు చూస్తున్నారు, పూజ నాన్న వైపు చూస్తూ ,మాస్టర్ గారి అమ్మ గారు మధ్యాహ్నం భోజనం పెట్టడం మరిచిపోయారు నాన్నా అందుకే ఆకలేసి కళ్ళు తిరిగాయి,అని తిరిగి తినడం ప్రారంభించింది.



రాజారావు. టి
9030827628

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

చేతిలో చావు...పార్ట్3