కోడలు పాట

పుట్టింట్లోమహారాణిలా పెరిగిన అమ్మాయి ,అత్త గారి ఇంట్లో చాలా కష్టాలు అనుభవిస్తుంది ,అత్తగారు తోడికోడలు, భర్త ఆమెను హింసిస్తూ ఉంటారు .ఆమె బాధతో ఏడుస్తూ ఉంటుంది ,అప్పుడు ఈ పాట:

పాట 2

ఏడవ కమ్మా చిన్నారి ,రేపటి రాజ్యానికి నువ్వే రాకుమారి కన్నీరొద్దమ్మా ,నవ్వవే ఒంటరి చిలకమ్మా !

అండగా ఉండే భర్త కాడు, ధైర్యం చెప్పే తండ్రి రాడు, నిన్ను ఎంత తిట్టినా,హింస పెట్టినా

మౌనంగా భరించడమే నీ ఆయుధం ,ఇది నీకు దేవుడు ఇచ్చిన శాపం .

విధి నిన్ను వెక్కి రించిన, కాలం నిన్ను కాటేసినా,

ఏడవ కమ్మా చిన్నారి ,రేపటి రాజ్యానికి నువ్వే రాకుమారి కన్నీరొద్దమ్మా ,నవ్వవే ఒంటరి చిలకమ్మా !

గడపదాటితే కాలనాగులు, అడుగడుగునా  విషపు కాట్లు, తగదమ్మా నీకు, గడప దాటి పోకు!

వస్తాడమ్మా వారసుడు,నీ కడుపున పుడతాడు,

తల్లికి శాపం వదల్చిన గరుత్మంతుడు ,శత్రువుల గుండెలు చీల్చే సంజయుడు !

కాలం నీపై కన్నెర్రజేసిన ,కష్టం నీపై నిప్పులు కురిపించినా,

ఏడవ కమ్మా చిన్నారి ,రేపటి రాజ్యానికి నువ్వే రాకుమారి కన్నీరొద్దమ్మా ,నవ్వవే ఒంటరి చిలకమ్మా !

ఆ ఇంట్లో మహా రాణి లా  పెరిగావు, ఈ ఇంట్లో బలిపశువు అయ్యావు.

 అమ్మ అవ్వాల్సిన అత్త ,అపమృత్యువు అయ్యింది ,తోడుగా ఉండాల్సిన తోడికోడలు ,తోడేలు అయ్యింది

!మామ కి నోరు రాదు ,భర్తకి మనసు లేదు .

మేఘాల వంటి నీ కష్టాలు కరగక తప్పదమ్మా,

ఆనంద చినుకులు నీపై కురవక మానవమ్మా!

నీ గ్రహణం వీడక తప్పదు ,సంతోష సూర్యుడు రాక మానడు.

ఏడవ కమ్మా చిన్నారి ,రేపటి రాజ్యానికి నువ్వే రాకుమారి కన్నీరొద్దమ్మా ,నవ్వవే ఒంటరి చిలకమ్మా !

నీ ఓర్పు కి భూమి చలించింది,నీ కన్నీటిలో సంద్రం ఉప్పొంగింది .

నిన్ను వేధించే వాళ్లకు  లేదు మనసు ,

వాళ్లని ఏం చేయాలో పైవాడికి తెలుసు!

ఆకాశం విరిగినా, పిడుగులు పడినా,

సహనం కోల్పోకమ్మా, సాయం వస్తుందమ్మా !

ఆకలి నీకు జోల పాడగా ,నొప్పి నిన్ను  జోకొట్టగా, హాయిగా నిద్రించు ,అందులోనే ఆనందించు!

ఏడవ కమ్మా చిన్నారి ,రేపటి రాజ్యానికి నువ్వే రాకుమారి ,కన్నీరొద్దమ్మా ,నవ్వవే ఒంటరి చిలకమ్మా !

Comments

Popular posts from this blog

మానవత్వం vs విలువలు

కుటుంబం...పార్ట్3

చేతిలో చావు...పార్ట్3